Telugu Global
Cinema & Entertainment

JILEBI Teaser - విజయ్ భాస్కర్ తీసిన జిలేబీ టీజర్ రివ్యూ

JILEBI Movie Teaser Review - లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా తీశాడు విజయ్ భాస్కర్. ఆయన తీసిన జిలేబీ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు.

JILEBI Teaser - విజయ్ భాస్కర్ తీసిన జిలేబీ టీజర్ రివ్యూ
X

సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిలేబి'. గుంటూరు రామకృష్ణ ఎస్ ఆర్ కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ హీరోయిన్.

ఇప్పటికే విడుదలైన 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ వినోదాత్మకంగా సాగింది. ''మా హాస్టల్ లో ఉన్నది స్టూడెంట్స్ కాదు వజ్రాలు. 24 హావర్స్ చదువుతూనే ఉంటారు'' అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో మొదలైన టీజర్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగింది. టీజర్ మధ్యలో వచ్చిన హారర్ ఎలిమెంట్ కూడా సరదాగా ఉంది.

దర్శకుడు విజయ్ భాస్కర్, ఫుల్ లెంగ్త్ ఫన్ ఫిలిం అందించబోతున్నాడనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  17 Jun 2023 2:26 AM GMT
Next Story