Telugu Global
Cinema & Entertainment

Project K - ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడా?

Kamal Hassan Prabhas - ప్రాజెక్ట్-కె సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడా? ఇందులో నిజమెంత?

Project K - ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడా?
X

నిన్నట్నుంచి హోరెత్తిపోతున్న న్యూస్ ఇది. ఇంతకీ ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడా లేదా? ప్రస్తుతానికైతే ఇది ఊహాగానమే. కానీ ఇందులో వాస్తవం కూడా కొంత ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమా కోసం కమల్ హాసన్ ను దాదాపు ఏడాదిగా ప్రయత్నిస్తున్న మాట వాస్తవం.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్-కె. ఇది పాన్ వరల్డ్ సినిమా. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ కథలోకి విలన్ గా కమల్ హాసన్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు నిర్మాత అశ్వనీ దత్.

కమల్ కోసం కొన్ని నెలలుగా యూనిట్ ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ ప్రతిపాదనకు కమల్ ఒప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రాజెక్ట్-కెలో విలన్ గా నటించేందుకు ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను కమల్ తీసుకుంటున్నట్టు కథనాలు వస్తున్నాయి.

అయితే వీటిపై యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు. నిజానికి ప్రాజెక్ట్-కె పై ఎప్పుడు ఎలాంటి రూమర్స్ వచ్చినా వెంటనే స్పందించడం నాగ్ అశ్విన్ కు అలవాటు. గతంలో ఇలా వచ్చిన ఎన్నో పుకార్లపై ఈ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఆయన సైలెంట్ అయ్యాడు. బహుశా.. డీల్ అంతా ఓకే అయిన తర్వాత మేటర్ ప్రకటిస్తారేమో.

First Published:  31 May 2023 3:45 AM GMT
Next Story