Telugu Global
Cinema & Entertainment

Devara | నార్త్ ఇండియా రైట్స్ దక్కించుకున్న కరణ్ జోహార్

Devara - బాహుబలి-1, బాహుబలి-2ను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్ చేశాడు కరణ్ జోహార్. మళ్లీ ఇన్నాళ్లకు దేవర సినిమాను నార్త్ లో పంపిణీ చేయబోతున్నాడు.

Devara | నార్త్ ఇండియా రైట్స్ దక్కించుకున్న కరణ్ జోహార్
X

ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్ గా చేస్తున్నాడు.

2 పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్‌ మేజర్‌ ప్లేయర్స్ ఈ చిత్రంతో చేతులు కలుపుతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు.

దేవర నార్త్ థియేట్రికల్‌ రైట్స్ ని కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ సొంతం చేసుకున్నారు. అత్యంత భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా నార్త్ రైట్స్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌, కొరటాల శివతో కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ, అపూర్వ మెహతా ఉన్న పిక్‌ని ఈ సందర్భంగా షేర్‌ చేశారు. ఎన్టీఆర్‌కి ఉత్తరాదిన ఉన్న స్టార్‌డమ్‌కి, కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ పేర్లు యాడ్‌ కావడంతో క్రేజ్ మరింత పెరిగింది. గతంలో బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్ని నార్త్ లో రిలీజ్ చేసింది వీళ్లే.

దేవర నుంచి ఇప్పటికే విడుదలైన దేవర గ్లింప్స్ సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. ఎన్టీఆర్‌ రోల్‌ మీద భీభత్సమైన ఇంట్రస్ట్ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో ఆయనతో పాటు ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, నరేన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


First Published:  10 April 2024 5:43 PM GMT
Next Story