Telugu Global
Cinema & Entertainment

Karthi - కార్తి నుంచి మరో ఆసక్తికర చిత్రం

Karthi New movie - జపాన్ అనే సినిమా చేస్తున్నాడు కార్తి. ఈ సినిమా పూర్తవ్వగానే 96 మూవీని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Karthi - కార్తి నుంచి మరో ఆసక్తికర చిత్రం
X

విలక్షణమైన కథలు ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు కార్తి. ఇప్పటికే చారిత్రక నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ సినిమా చేశాడు. అంతకంటే ముందు సర్దార్ అనే యాక్షన్ మూవీ చేశాడు. ప్రస్తుతం జపాన్ అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఇప్పుడీ హీరో మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 96 లాంటి సెన్సిబుల్ సినిమాను తీసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు కార్తి.

సూర్య నిర్మాతగా 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఇందులో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకున్నారు. ఇది ప్రేమకథ కాదు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

ఈమధ్యకాలంలో కార్తి కుటుంబ కథాచిత్రం చేసి చాన్నాళ్లయింది. ఆ లోటును తీరుస్తూ ఈ సినిమా రాబోతోంది. కెరీర్ లో కార్తికి ఇది 27వ సినిమా. జపాన్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది. సినిమా మొదలైన వెంటనే మరిన్ని వివరాలు బయటకొస్తాయి.

First Published:  5 Jun 2023 11:13 AM GMT
Next Story