Telugu Global
Cinema & Entertainment

Japan Movie | అడ్వెంచరస్ థ్రిల్లర్ టీజర్

Karthi's Japan Movie - కార్తి హీరోగా నటిస్తున్న సినిమా జపాన్. ఈ సినిమా టీజర్ రిలీజైంది. గమ్మత్తుగా ఉంది. మీరూ చూసేయండి..

Japan Movie | అడ్వెంచరస్ థ్రిల్లర్ టీజర్
X

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా 'జపాన్' అనే సినిమా చేస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు.

హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది?

ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది. ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు.

జపాన్ రేంజే వేరు. అమ్మాయిలు, గోల్డ్ తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా. ఇలా డిఫరెంట్ పాత్రలు జపాన్ కోసం చెప్పే వాయిస్ ఓవర్ లో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

టీజర్ లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కార్తి డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఎక్స్ ట్రార్డినరీ లుక్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశారు కార్తి. చివర్లో 'ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ఎవరూ ఏం పీకలేర్రా'' అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ కూడా ఆసక్తికరంగా ఉంది.

అలాగే టీజర్ లో సునీల్ లుక్, గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దర్శకుడు రాజు మురుగన్ ఇంట్రస్టింగ్ గ్రిప్పింగ్ నెరేషన్ తో కథపై క్యురియాసిటీ పెంచాడు. జివి ప్రకాష్ కుమార్ నేపధ్యం సంగీతం బాగుంది. ఓవరాల్ గా సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేలా ఉంది టీజర్.

ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. నేషనల్ అవార్డ్ విన్నర్ వినేష్ బంగ్లాన్, జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. ఈ దీపావళికి జపాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

First Published:  19 Oct 2023 2:31 AM GMT
Next Story