Telugu Global
Cinema & Entertainment

Love Me | చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో ఆడియో ఫంక్షన్

Love Me Audio Function - చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో ఓ ఆడియో ఫంక్షన్ జరిగింది. లవ్ మీ సినిమా కోసం దిల్ రాజు మళ్లీ ఆ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు.

Love Me | చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో ఆడియో ఫంక్షన్
X

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈమధ్య కాలంలో ఓ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయడం ఇదే తొలిసారి. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ.. " ఏదో వండ‌ర్ క్రియేట్ చేయాల‌ని, కొత్త‌వారితో క‌లిసి కీరవాణి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే విధంగా ఏఐ ద్వారా ఓ పాట పాడించారు. ఎక్స్ పెరిమెంట‌ల్‌గా చేశారు. కీర‌వాణిగారు ఈ సినిమా పాట‌ల్లో చేసిన‌ ప్ర‌యోగాల‌న్నీ నాకు తెలుసు. ముందు నాలుగు పాట‌ల‌నే అనుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కీర‌వాణి ద‌గ్గ‌రికి సినిమా వెళ్లాక‌, మొత్తం 7 పాట‌లు చేశారు. ఆట‌గ‌ద‌రా శివ సాంగ్ ని ముందు అనుకోలేదు.కానీ, పాట విన్నాక చాలా మంచి వైబ్‌ అనిపించింది. ఆ పాట సినిమాను ఇంకో లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది. కొత్త‌గా కొత్త కొత్త‌గా అనే పాట కూడా చాలా బావుంది. క్లైమాక్స్ లో వస్తుంది ఈ పాట‌. టోట‌ల్ సినిమాను రౌండ‌ప్ చేయ‌డానికి ఈ పాట‌ను పెట్టారు." అన్నారు.

ఆడియో ఈవెంట్స్ ని మ‌ర్చిపోయి చాలా రోజులైందని... మ‌ళ్లీ ఆ క‌ల్చ‌ర్‌ని తీసుకొస్తున్నామని ప్రకటించారు దిల్ రాజు. ఇకపై వీలైనప్పుడల్లా తమ సినిమాలకు ఇలా ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చేస్తామని ప్రకటించారు.

First Published:  9 April 2024 5:21 PM GMT
Next Story