Telugu Global
Cinema & Entertainment

MAD Square | మళ్లీ మొదలైన మ్యాడ్

MAD Movie Sequel - సూపర్ హిట్టయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ నడుస్తోంది. ఈరోజు మూవీని ప్రకటించారు.

MAD Square | మళ్లీ మొదలైన మ్యాడ్
X

ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ', 'టిల్లు స్క్వేర్' వంటి హిట్ చిత్రాలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇది రెండో సీక్వెల్.

'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన 'టిల్లూ స్క్వేర్‌'కి రచయితలలో ఒకడిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్‌'తో రాబోతున్నారు.

'మ్యాడ్'లో నటించి మెప్పించిన హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగింది. హీరోయిన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇటీవల ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు'కి సీక్వెల్‌ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'మ్యాడ్' కోసం పని చేసిన టెక్నీషియన్లే, 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

First Published:  19 April 2024 5:10 PM GMT
Next Story