Telugu Global
Cinema & Entertainment

Matka Movie | రెగ్యులర్ షూట్ కు రెడీ అయిన వరుణ్ తేజ్

Matka Movie - వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ మట్కా. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు.

Matka Movie | రెగ్యులర్ షూట్ కు రెడీ అయిన వరుణ్ తేజ్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నాడు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం 'మట్కా' రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను ఉంటాయి. నలుగురు ఫైట్ మాస్టర్‌లు యాక్షన్ ని పర్యవేక్షిస్తారు.

24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ 4 విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది.

వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 'మట్కా' సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. మట్కా అనే జూదం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్నాడు.

First Published:  26 Nov 2023 1:26 PM GMT
Next Story