Telugu Global
Cinema & Entertainment

Matka | వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైంది

Matka - వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

Matka | వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైంది
X

వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరుపుకుంటున్న షూటింగ్ కోసం ఓ భారీ సెట్‌ నిర్మించారు. 1958, 1982 మధ్య జరిగిన కథతో వస్తున్న ఈ సినిమా కోసం, అప్పటి పరిసరాల్ని తలపించేలా అద్భుతంగా సెట్స్ వేశారు.

యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా ‘మట్కా’ సినిమా వస్తోంది. 24 ఏళ్ల స్పాన్ కలిగిన ఈ కథలో వరుణ్ తేజ్ 4 విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నాడు. వరుణ్ పూర్తి మేకోవర్ ఇందులో చూస్తారు.

వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈచిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌత్‌లో అత్యంత బిజీగా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, తంగలన్ ఫేమ్ ఏ కిషోర్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నలుగురు ఫైట్ మాస్టర్‌లు పని చేస్తున్నారు. ‘మట్కా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

First Published:  15 Dec 2023 5:01 PM GMT
Next Story