Telugu Global
Cinema & Entertainment

SARIPODHA SHANIVAARAM | నాని సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు

Saripodha Shanivaaram - నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తయింది.

Saripodhaa Sanivaaram | అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేసిన నాని
X

Saripodhaa Sanivaaram | అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేసిన నాని

నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ జోరుగా సాగుతోంది. దసరా తర్వాత నాని చేస్తున్న సినిమా ఇది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. గతంలో హీరో, డైరెక్టర్ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ పరాజయం పాలైంది. అయితే, ఆ ఫలితం సరిపోదా శనివారం మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు.

సినిమా అంచనా బడ్జెట్ దాదాపు 80 కోట్ల రూపాయలు. నిర్మాత దానయ్య భారీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో సేఫ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేయగా, శాటిలైట్ తో పాటు ఇతర హక్కుల చర్చలు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి.

అలా ఈ సినిమా టోటల్ బిజినెస్ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2023లో దసరా, హాయ్ నాన్న వంటి విజయాలను అందుకున్న నేచురల్ స్టార్ నాని, ఈ సినిమాతో 2024లో తన విజయాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు.

సరిపోద శనివారం సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ఎస్‌జే సూర్య విలన్‌.

First Published:  30 Jan 2024 4:58 PM GMT
Next Story