Telugu Global
Cinema & Entertainment

Saripodha Shanivaaram | రిలీజ్ డేట్ ప్రకటించిన నాని

Saripodha Shanivaaram - సరిపోదా శనివారం రిలీజ్ డేట్ బయటకొచ్చింది. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 29న విడుదల చేయబోతున్నారు.

Saripodha Shanivaaram | రిలీజ్ డేట్ ప్రకటించిన నాని
X

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి కలిశారు. రెండో ప్రయత్నంగా సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. 'అంటే సుందరానికీ' చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, సరిపోదా శనివారం సినిమాలో యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. 'సరిపోదా శనివారం' ఆగస్ట్ 29న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. హీరో నాని పిడికిలి బిగించి మరో చెత్తో రౌడీని పట్టుకున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కోపం మొత్తాన్ని దాచుకొని కేవలం శనివారం రోజున మాత్రమే దాన్ని ప్రదర్శించే వ్యక్తి పాత్రలో నాని కనిపిస్తున్నాడు.

First Published:  3 March 2024 6:56 AM GMT
Next Story