Telugu Global
Cinema & Entertainment

Saripodhaa Sanivaaram | నాని సినిమా షూటింగ్ అప్ డేట్స్

Saripodhaa Sanivaaram - నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా షెడ్యూల్ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది.

Saripodhaa Sanivaaram | నాని సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

గత నెలలో ఈ సినిమా ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా , కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ భారీ షెడ్యూల్ లో ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో పాటు.. ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు. నాని, ఇతర కీలక నటీనటులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు.

గతంలో విడుదలైన గ్లింప్స్ లో చూపించినట్టుగా, నాని ఈ సినిమాలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. హాయ్ నాన్న తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇదే.

First Published:  28 Dec 2023 4:06 PM GMT
Next Story