Telugu Global
Cinema & Entertainment

Nithin Extra ordinary | నితిన్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్

Nithin's Extra ordinary Man - నితిన్ కొత్త సినిమాకు ఎక్స్ టార్డనరీ మేన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Nithin Extra ordinary | నితిన్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్
X

నితిన్ కొత్త సినిమాకు `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌` అనే టైటిల్ పెట్టారు. కెరీర్ లో నితిన్ కు ఇది 32వ చిత్రం. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటు చాలా విశేషాలు వెల్లడించారు.

నిజానికి ఈ సినిమా టైటిల్ `ఎక్స్‌ట్రా`. `ఆర్డిన‌రీ మేన్‌` అనేది ట్యాగ్ లైన్‌. కలిపి చదివితే ఎక్స్ డార్డనరీ మేన్ అవుతుందన్నమాట. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 60 శాతం షూట్ పూర్తి చేసుకుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌.

ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. పోస్ట‌ర్‌లో నితిన్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపిస్తున్నాడు. ఓ దానిలో ఆయ‌న హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. అదే పోస్ట‌ర్‌లో మ‌రో లుక్‌లో ట్రిమ్ చేసిన గడ్డంతో చాలా కూల్‌గా క‌నిపిస్తున్నాడు.

పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో ఓ స‌న్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్ క‌నిపిస్తుంది. అలాగే క్లాప్ బోర్డ్ కూడా క‌నిపిస్తుంది. ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. హ‌రీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  23 July 2023 2:35 PM GMT
Next Story