Telugu Global
Cinema & Entertainment

Extra Ordinary Man Movie Song | నితిన్ సోలో సాంగ్ రిలీజ్

Extra Ordinary Man Movie Song | ఇప్పటికే ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైంది. పెద్ద హిట్టయింది. ఇప్పుడు రెండో పాట వచ్చింది. ఇది సోలో సాంగ్.

Extra Ordinary Man Movie Song | నితిన్ సోలో సాంగ్ రిలీజ్
X

Extra Ordinary Man Movie Song | నితిన్ సోలో సాంగ్ రిలీజ్

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘బ్రష్ వేసుకో..’ అనే లిరికల్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. దీనికి సీఎంఆర్ కాలేజ్ వేదికగా మారింది. పాటను వింటుంటే చాలా హమ్మింగ్ గా అనిపించింది. హేరిష్ జైరాజ్ ముద్ర కనిపించింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సంజిత్ హెగ్డే పాడాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల...’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్.. అందులో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ మెప్పించింది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ కనిపించని సరికొత్త అవతార్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నారు ప్రేక్షకులు. అతడి లుక్ తో పాటు, మేనరిజమ్స్ కూడా కొత్తగా ఉంటాయంటున్నారు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీతం అందిస్తుండ‌టం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

First Published:  11 Nov 2023 1:27 PM GMT
Next Story