Telugu Global
Cinema & Entertainment

Family Star | మిలియన్ డాలర్ క్లబ్ కు దూరంగా...

Family Star - విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమని తేల్చేసింది ట్రేడ్.

Family Star | మిలియన్ డాలర్ క్లబ్ కు దూరంగా...
X

భారీ అంచనాల మధ్య విడుదలైంది ఫ్యామిలీ స్టార్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. అదేంటో... సోషల్ మీడియాలో కనిపించిన హైప్ జనాల్లో కనిపించలేదు. ఓపెనింగ్ రోజు నుంచే ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. హిట్టయితే చూద్దాం అనే ఫీలింగ్ లో ప్రేక్షకులున్నారు.

దురదృష్టవశాత్తూ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో, ఆటోమేటిగ్గా రెండో రోజు నుంచి ఆక్యుపెన్సీ పడిపోయింది. అటు ఓవర్సీస్ లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగడం బాధాకరం. రిలీజై మొదటి వారం పూర్తయినా ఇంకా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరలేదు. ఇప్పటివరకు 8 లక్షల డాలర్ల వసూళ్లు సాధించిన ఈ మూవీ, మిలియన్ క్లబ్ లోకి చేరడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది

గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందనగానే అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రేక్షకులు చాలా ఊహించుకున్నారు. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఆ అంచనాలకు తగ్గట్టు లేదు.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు. ఉగాది రోజున కాస్త కోలుకున్న ఈ సినిమా, ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం అంటోంది ట్రేడ్.

First Published:  10 April 2024 5:41 PM GMT
Next Story