Telugu Global
Cinema & Entertainment

NTR: మార్చి 20 నుంచి ఎన్టీఆర్-కొరటాల సినిమా

NTR Koratala movie - ఎన్టీఆర్-కొరటాల సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మార్చి 20 నుంచి షూటింగ్ మొదలవుతుంది.

NTR: మార్చి 20 నుంచి ఎన్టీఆర్-కొరటాల సినిమా
X

ఆర్ఆర్ఆర్ తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయాడు ఎన్టీఆర్. ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. కొరటాల దర్శకత్వంలో ఆయన సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లేట్ అవ్వడంతో ఎన్టీఆర్ కెరీర్ లో గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ క్లియర్ అయిపోయాయి

మార్చి 20వ తేదీ నుంచి ఎన్టీఆర్-కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ గ్యాప్ లో లాంఛనంగా సినిమాను ప్రారంభిస్తారు. ఈ సినిమాతో యువసుధ బ్యానర్ టాలీవుడ్ కు పరిచయమౌతోంది. కొరటాల ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేని నిర్మాత.

ఈ ప్రాజెక్టుతో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ పనులు మొదలయ్యాయి. మరోవైపు లొకేషన్ల వేట కూడా పూర్తయింది.

ఈ సినిమా టోటల్ షూటింగ్ ను 6 నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. కొరటాల ఎప్పుడు అడిగితే అప్పుడు సెట్స్ పైకి వచ్చేందుకు ఎన్టీఆర్, తన సమయం మొత్తాన్ని దీనికి కేటాయిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తాడు తారక్.

First Published:  4 Feb 2023 8:05 AM GMT
Next Story