Telugu Global
Cinema & Entertainment

Nuvve Nuvve: ఆ సినిమా రీ-రిలీజ్ అవుతోంది!

త్రివిక్రమ్ ను దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా నువ్వే నువ్వే. ఇప్పుడీ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది.

Nuvve Nuvve: ఆ సినిమా రీ-రిలీజ్ అవుతోంది!
X

త్రివిక్రమ్ ను దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా నువ్వే నువ్వే. తరుణ్-శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిషోర్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ అంతా మరోసారి కలిశారు. పండగ చేసుకున్నారు.

ఇప్పుడీ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. కేవలం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాత్రమే కాదు, త్రివిక్రమ్ పుట్టినరోజును కూడా కలిపి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

నువ్వే-నువ్వే సినిమాకు కల్ట్ స్టేటస్ వచ్చేసింది. ఇందులో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఆల్రెడీ ఓటీటీలో, యూట్యూబ్ లో, టీవీల్లో చాలామంది చూసేశారు. ఇప్పుడీ సినిమా కోసం ఆడియన్స్ మరోసారి థియేటర్లకు వస్తారా అనేది అనుమానం.

First Published:  2 Nov 2022 3:15 AM GMT
Next Story