Telugu Global
Cinema & Entertainment

Operation Valentine | వరుణ్ తేజ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Operation Valentine - వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ ప్రకటించారు.

Operation Valentine | వరుణ్ తేజ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్న చిత్రం'ఆపరేషన్ వాలెంటైన్' సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. యదార్ధ ఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ నటిస్తున్నారు. టాలీవుడ్ లో తొలి ఎయిర్‌ఫోర్స్‌ సినిమా ఇదే.

ఆల్రెడీ ఈ సినిమా ఓసారి వాయిదాపడింది. గొప్ప అనుభూతిని ఇచ్చేందుకు, మేకింగ్ కోసం టైమ్ తీసుకుంటున్నట్టు తెలిపిన మేకర్స్.. తాజాగా మరో విడుదల తేదీ ప్రకటించారు.'ఆపరేషన్ వాలెంటైన్' ఫిబ్రవరి 16 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' లో పూర్తిస్థాయిలో దేశభక్తిని చూపించబోతున్నారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. మన వైమానికదళ వీరుల అసమాన ధైర్యసాహసాలని, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపించబోతున్నారు.

‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. యాడ్-ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది.

First Published:  12 Dec 2023 4:25 PM GMT
Next Story