Telugu Global
Cinema & Entertainment

OG Movie - పవన్ కొత్త సినిమా సెట్స్ పైకి

Pawan Kalyan OG Movie - సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఓజీ మూవీ. ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు పవన్.

OG Movie - పవన్ కొత్త సినిమా సెట్స్ పైకి
X

మొన్నటివరకు రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ అయ్యాడు ఈ హీరో. పొలిటికల్ మీటింగ్స్ కంటే ముందు సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా స్టార్ట్ చేశాడు పవన్. ముంబయి, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశాడు.

ఇప్పుడు అదే సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. ఇవాళ్టి నుంచి ఓజీ సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టాడు పవన్ కల్యాణ్.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేస్తాడు పవన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్ రిలీజైన సంగతి తెలిసిందే.

First Published:  18 May 2023 3:48 PM GMT
Next Story