Telugu Global
Cinema & Entertainment

Hari Hara Veera Mallu: సెట్స్ పైకొచ్చిన పవన్ కల్యాణ్

Hari Hara Veera Mallu: ఎట్టకేలకు పవన్ కల్యాణ్ సినిమా సెట్స్ పైకొచ్చింది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి రీసెంట్ గా వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పుడు సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు.

Hari Hara Veera Mallu: సెట్స్ పైకొచ్చిన పవన్ కల్యాణ్
X

Hari Hara Veera Mallu: ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకొచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ను నిన్న రామోజీ ఫిలింసిటీలో మొదలుపెట్టారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో పవన్ కల్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ షెడ్యూల్ ను 2 వారాల పాటు కొనసాగించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. అయితే ఎన్నాళ్లు కొనసాగిస్తారనే అంశంపై క్లారిటీ లేదు. పవన్ రాజకీయ కార్యాచరణపై ఈ షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది.

ఏఎం రత్నం నిర్మాతగా మెగాసూర్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతానికైతే ఈ సినిమా వరకే కమిట్ అయ్యాడు పవన్ కల్యాణ్. వచ్చే నెలలో వినోదాయ శితం రీమేక్ ను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అదింకా కొలిక్కి రాలేదు.

First Published:  27 Oct 2022 3:47 AM GMT
Next Story