Telugu Global
Cinema & Entertainment

OG Movie - పవన్ కల్యాణ్ సినిమాకు డేట్ ఫిక్స్

Pawan Kalyan's OG Movie - ఓజీ మూవీకి కాల్షీట్లు కేటాయించాడు పవన్. సోమవారం నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.

OG Movie - పవన్ కల్యాణ్ సినిమాకు డేట్ ఫిక్స్
X

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం పవన్ కెరీర్ లో ఇదే తొలిసారి.

ఆయన ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. రేపటితో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తవుతుంది. ఓ 2 రోజులు గ్యాప్ తీసుకొని సోమవారం నుంచి కొత్త సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు పవన్. అదే ఓజీ. సుజీత్ దర్శకత్వంలో ఏప్రిల్ 17 నుంచి ఓజీ రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.

‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. సోమవారం ముంబైలో జరిగే షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారు.

ఓజీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన తర్వాత, 'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్‌ను తిరిగి షిఫ్ట్ అవుతాడు పవన్ కల్యాణ్. ఇలా ఒకేసారి ఓజీ, ఉస్తాద్, వీరమల్లు సినిమాల్ని పూర్తిచేయబోతున్నాడు. ఓజీలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు. డీవీవీ దానయ్య దీనికి నిర్మాత.

First Published:  13 April 2023 12:44 PM GMT
Next Story