Telugu Global
Cinema & Entertainment

OG Movie - పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

OG Movie - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో షెడ్యూల్ మొదలైంది.

OG Movie - పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

వరుసపెట్టి ఓజీ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తున్నాడు హీరో పవన్ కల్యాణ్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. నిన్నట్నుంచి ఈ షెడ్యూల్ లో పవన్ జాయిన్ అయ్యాడు. పవన్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఓజీ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు డుమ్ము కొట్టలేదు పవన్. వరుసగా ఆ సినిమాకే వర్క్ చేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత తొలిసారి, ఈ సినిమా కోసమే తెలుగు రాష్ట్రాలు దాటి మహారాష్ట్ర వెళ్లాడు పవన్. ముంబయి, పూణెలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.

ఆ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి సెకెండ్ షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు. ఇప్పుడు హైదరాబాద్ లోనే మూడో షెడ్యూల్ లో కూడా జాయిన్ అయి, షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు ఈ హీరో.

ఈ షెడ్యూల్ లోనే ఒక్క రోజు మాత్రం బ్రో సినిమా సెట్స్ లో అడుగుపెడతాడు పవన్. ఆ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది. ఆల్రెడీ ఊర్వశి రౌథేలా, సాయిధరమ్ తేజ్ పై ఆ సాంగ్ షూట్ మొదలైంది. పవన్ జాయిన్ అయితే టోటల్ షూట్ కంప్లీట్ అవుతుంది.

First Published:  9 Jun 2023 10:23 AM GMT
Next Story