Telugu Global
Cinema & Entertainment

OG Movie | పవన్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

OG Movie - పవన్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

OG Movie | పవన్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఓజీ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ తో ప్రకటన చేశారు.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా తెరకెక్కుతోంది ఓజీ సినిమా. సాహో తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుజీత్, ఈ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్టు కావడంతో.. పవన్ వెంటనే కాల్షీట్లు ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60శాతం పూర్తయింది. మిగతా భాగం షూటింగ్ కోసం పవన్ మరో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. అటు సుజీత్ కూడా పక్కా ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్నాడు.

ఈ విషయాన్నీ పవన్ తో చర్చించిన తర్వాత రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడిలో ఉన్న పవన్ కల్యాణ్, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓజీ సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.




First Published:  7 Feb 2024 1:38 AM GMT
Next Story