Telugu Global
Cinema & Entertainment

Tholi Prema: పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్

Pawan Kalyan's Tholi Prema Movie re release date: పవన్ కల్యాణ్ కెరీర్ లో క్లాసిక్ మూవీ తొలి ప్రేమ. ఇప్పుడీ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరిలో రీ-రిలీజ్ కాబోతోంది.

Tholi Prema: పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్
X

Tholi Prema: పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్

పవన్ కల్యాణ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్స్ గా గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో ఖుషి ఒకటి. అతడికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన మూవీ అది. తాజాగా రీ-రిలీజ్ అయిన ఆ సినిమా దుమ్మురేపింది. రెగ్యులర్ సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పవన్ నుంచి మరో కల్ట్ క్లాసిక్ రాబోతోంది.

పవన్ కల్యాణ్ కు ఎంతో ఇష్టమైన తొలిప్రేమ సినిమా కూడా రి-రిలీజ్ కు రెడీ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరిలో ఈ సినిమాను థియేటర్లలోకి మరోసారి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సినిమాను హెడ్ డీ ఫార్మాట్ లోకి మార్చడం, ఆడియోను డాల్బీ సిస్టమ్ లోకి ఎక్కించడం లాంటి పనులు సాగుతున్నాయి. అవన్నీ పూర్తయిన వెంటనే తొలిప్రేమ రీ-రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.

పవన్-కీర్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకంటూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇలాంటి సినిమా థియేటర్లలోకి వస్తే మరోసారి ఎంజాయ్ చేసేందుకు చాలామంది రెడీ. కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకుడు.

First Published:  2 Jan 2023 8:30 AM GMT
Next Story