Telugu Global
Cinema & Entertainment

మా సినిమాలో విలన్ కూడా హీరోనే!

క్రేజీ ఫెలో సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు ఫణి కృష్ణ. ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో విలన్ కూడా హీరోనే అంటున్నాడు.

మా సినిమాలో విలన్ కూడా హీరోనే!
X

ప్రతి సినిమాలో హీరో ఉంటాడు, అతడికి పోటీగా విలన్ కూడా ఉంటాయి. అయితే తమ సినిమాలో హీరోతో పాటు, విలన్ కూడా హీరోనే అని చెబుతున్నాడు దర్శకుడు ఫణి కృష్ణ. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన క్రేజీ ఫెలో సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్న ఫణి కృష్ణ, తన సినిమాలో విలన్ కూడా హీరోగానే కనిపిస్తాడని అంటున్నాడు.

"ఆది ఇందులో కొత్తగా కనిపిస్తాడు. ఆయన నటన కూడా కొత్తగా ఉంటుంది. ఒక కొత్త ఆదిని చూస్తారు. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశాడు. ఇందులో యాక్షన్ కూడా ఉంది. అయితే ఇందులో విలన్ కూడా హీరోనే. అతని వలన అతనికే సమస్యలు వస్తుంటాయి. (నవ్వుతూ). చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా చాలా కీలకం."

ఇలా క్రేజీ ఫెలో సినిమాలో విలన్ పాత్ర గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. ఇక ఈ సినిమా మొత్తం ఆది సాయికుమార్ పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఇలాంటి ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్ ను ఆది చేసి చాలా రోజులైందని అంటున్నాడు.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కెకె.రాధామోహన్ నిర్మించారు.




First Published:  12 Oct 2022 5:20 AM GMT
Next Story