Telugu Global
Cinema & Entertainment

Nani Puja Hegde | పూజా హెగ్డేకు మరో ఛాన్స్?

Pooja Hegde Nani - ప్రస్తుతం ఖాళీగా ఉంది పూజాహెగ్డే. తెలుగులో ఆమె చేతిలో కొత్త సినిమాల్లేవ్. ఎట్టకేలకు ఆమె ఓ టాలీవుడ్ మూవీకి ఒక అడుగు దూరంలో ఉంది.

Nani Puja Hegde | పూజా హెగ్డేకు మరో ఛాన్స్?
X

నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు శౌర్యువ్ దర్శకత్వంలో తన కొత్త సినిమా హాయ్ నాన్న ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ హీరో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.

శివ కార్తికేయన్‌తో డాన్ సినిమా చేసి తమిళంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టిన సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, ఈ వార్త టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు పూజా హెగ్డేను సంప్రదించినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే ఇందులో నటించేందుకు ఒప్పుకుందంట. అలా నాని, పూజాహెగ్డే ఫ్రెష్ కాంబినేషన్ సెట్ అయింది.

ఆల్రెడీ నాని చేతిలో ఓ సినిమా ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు సిబి చక్రవర్తి సినిమాను అతడు కొనసాగించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.

First Published:  6 Dec 2023 2:10 PM GMT
Next Story