Telugu Global
Cinema & Entertainment

Virat Raj | ప్రభాస్ తమ్ముడు హీరోగా సినిమా

Prabhas Brother Virat Raj - ప్రభాస్ కు తమ్ముడు వరుసయ్యే విరాట్ రాజ్ హీరోగా మారాడు. సినిమా లాంఛ్ అయింది. చాలా ప్రత్యేకతలున్నాయి.

Virat Raj | ప్రభాస్ తమ్ముడు హీరోగా సినిమా
X

రెబల్ స్టార్ కృష్ణంరాజు బంధువు యంగ్ హీరో విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రభాస్ కు వరుసకు తమ్ముడు అవుతాడు విరాట్ రాజ్.

ఈరోజు పూజా ముహూర్తంతో సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ టైటిల్‌ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి 'గౌడ్ సాబ్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ సుకుమార్ మేకర్స్ కు స్క్రిప్ట్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. జానీ మాస్టర్, భాను మాస్టర్, అన్నీ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా గణేష్ మాస్టర్ ముహూర్తం సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా లాంఛింగ్ కు సుకుమార్ రావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. గణేష్ మాస్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి సుకుమార్. ఆయన తీసిన జగడం సినిమాతోనే గణేశ్, కొరియోగ్రాఫర్ గా మారాడు. ఇప్పుడు సుకుమార్ చేతుల మీదుగా దర్శకుడిగా మారుతున్నాడు.

First Published:  10 April 2024 5:33 PM GMT
Next Story