Telugu Global
Cinema & Entertainment

Priyanka Mohan: పవన్ తో షూట్ స్టార్ట్ చేసిన ప్రియాంక

Priyanka Mohan and Pawan Kalyan Movie: పవన్ కల్యాణ్ తో కలిసి షూటింగ్ స్టార్ట్ చేసింది ప్రియాంక మోహన్. టాలీవుడ్ లో ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం.

Priyanka Mohan: పవన్ తో షూట్ స్టార్ట్ చేసిన ప్రియాంక
X

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. హీరో పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

'డాక్టర్‌', 'డాన్‌', 'గ్యాంగ్‌ లీడర్', 'శ్రీకారం' వంటి చిత్రాలతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా ఆమె సెట్స్ లో కూడా జాయిన్ అయింది. పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ముంబయి షెడ్యూల్, ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  20 April 2023 1:31 AM GMT
Next Story