Telugu Global
Cinema & Entertainment

Puli Meka - టాలీవుడ్ నటీనటులతో వెబ్ సిరీస్

Puli Meka web series trailer - ఆది సాయికుమార్ తొలిసారి నటించిన వెబ్ సిరీస్ పులి మేక. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది

Puli Meka - టాలీవుడ్ నటీనటులతో వెబ్ సిరీస్
X

సీరియ‌ల్ థ్రిల్ల‌ర్స్‌కి, సైకో కిల్ల‌ర్ వెబ్‌సీరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్‌డౌన్‌లో మొద‌లైన ఈ ఫీవ‌ర్‌, సిరీస్ ల‌వ‌ర్స్‌లో ఇంకా త‌గ్గ‌లేదు. అలాంటి వారికి డ‌బుల్ థ్రిల్లింగ్ క‌లిగించ‌నుంది ‘పులి మేక‌’. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘పులి మేక‌’ ట్రైల‌ర్‌లోనూ అదే స్పీడ్ క‌నిపిస్తోంది. స్టార్టింగ్ టు ఎండింగ్ రేసీ నెరేష‌న్ సిరీస్ మీద స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తోంది.


‘పులి మేక’ అనే ఈ వెబ్ సిరీస్ కోసం జీ5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే.. టాలీవుడ్ లో పేరున్న నటీనటులు ఎంతోమంది ఇందులో నటించారు. సాధారణంగా వెబ్ సిరీస్ లో అంతగా గుర్తింపునకు నోచుకోని వాళ్లు కనిపిస్తారు. పులి-మేక అందుకు విరుద్ధం.


లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్, సుమంత్, గోపరాజు, పల్లవి శ్వేత.. ఇలా చాలామంది నటీనటులు ఇందులో కనిపిస్తారు.


ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. ‘‘చావు చెప్పిరాదు, వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాదు అంటూ మొదల‌వుతుంది పులిమేక ట్రైల‌ర్‌. ఆ డైలాగును చెప్పిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపించే దృశ్యాలు బాగున్నాయి. డైలాగ్ విన‌గానే భ‌గ‌వ‌ద్గీత గుర్తుకొస్తుంది. నెల కిందట షామిర్‌పేట్ లేక్ ద‌గ్గ‌ర ఎస్ ఆర్ న‌గ‌ర్ ఎస్ ఐ అనిల్ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ఆ మ‌ర్డ‌ర్ చేసింది, ఈ మ‌ర్డ‌ర్ చేసింది ఒక్క‌రే సార్ అని చెబుతూ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ కేర‌క్ట‌ర్‌లో ప‌రిచ‌య‌మ‌వుతారు ఆది. పోలీసాఫీసర్ గా సుమన్‌ క‌నిపిస్తాడు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి ఒక సైకో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని టార్గెట్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతుంది.


ఈ కేసును డీల్ చేయ‌డం కోసం అపాయింట్ అవుతుంది ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ ప్ర‌భ పాత్రలో లావ‌ణ్య‌. త‌న‌కంటూ ఓ టీమ్‌ని సెల‌క్ట్ చేసుకుని ఈ కేసును డీల్ చేసిన‌ట్టు మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఈ ఛేజింగ్‌లో ఆమెకు సాయం చేస్తాడు ప్ర‌భ‌. పులి మేక క‌థ‌లో పులి ఎవ‌రో తెలియాలి అంటూ జ‌రిగే ఇన్వెస్టిగేష‌న్ ఆడియ‌న్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. జంతువులాంటి మ‌నిషి కోసం కిర‌ణ్ ప్ర‌భ అండ్ ప్ర‌భాక‌ర్‌ టీమ్ చేసే ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? అనేది ఈ వెబ్ డ్రామా.



First Published:  22 Feb 2023 2:29 AM GMT
Next Story