Telugu Global
Cinema & Entertainment

Rajamouli | మరోసారి బాహుబలి గురించి మాట్లాడిన రాజమౌళి

Rajamouli - బాహుబలి గురించి మరోసారి మాట్లాడాడు రాజమౌళి. ఆ సినిమా త్వరలోనే యానిమేషన్ సిరీస్ రూపంలో రాబోతోంది.

Rajamouli | మరోసారి బాహుబలి గురించి మాట్లాడిన రాజమౌళి
X

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ టీమ్.. డిస్నీహాట్‌స్టార్ అప్ కమింగ్ యానిమేటెడ్ సిరీస్ ఇది. ఈ యానిమేషన్ సిరీస్ యునివర్స్ ని హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్ లో గ్రాండ్ గా ఆవిష్కరించారు. ఈ యానిమేటెడ్ సిరీస్, మాహిష్మతి అద్భుత రాజ్యాన్ని, సింహాసనాన్ని పెను ముప్పు నుండి రక్షించడానికి బాహుబలి, భల్లాలదేవ చేతులు కలిపిన సామ్రాజ్యాల ఘర్షణ న చూపిస్తుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, రాజమౌళి, కలిసి నిర్మించారు. జీవన్ J. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు.

"బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్'తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది. బాహుబలి కోసం క్యారెక్టర్ ఆర్క్స్, ప్రీ స్టొరీ, పోస్ట్ స్టొరీ రాసినప్పుడు బాహుబలిలో యూనివర్స్ లో ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ ఉంది అనిపించింది. వెస్ట్రన్ కంట్రీస్ లో ఒక సినిమా విజయవంతమైతే ఆ బ్రాండ్ అనేక మీడియమ్స్ లో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. సినిమా విజయవంతమైతే అక్కడితో అయిపోతుంది. అయితే మేము ఈ విజయాన్ని కొనసాగించాలని వీర్ ఫిలిమ్స్, సిరిస్ ఇలా చాలా విధాలుగా ప్రయత్నించాం. అయితే ఈ ప్రయాణంలో సరైన వ్యక్తులతో జతకట్టాలని అర్ధమైంది. అందుకే డిస్నీకి అవకాశం ఇచ్చాం. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ డిస్నీహాట్‌స్టార్ లో ప్రేక్షకులని అలరించనుంది".

ఈనెల 17 నుంచి ఈ యానిమేషన్ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. తెలుగు చిత్ర సీమలో ఇదొక కొత్త పోకడ. ఇది హిట్టయితే, ఈ టైపులో మరిన్ని సినిమాలు యానిమేషన్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  8 May 2024 1:24 AM GMT
Next Story