Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమా మొదలుపెట్టిన రాజశేఖర్

హీరో రాజశేఖర్ కొత్త సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా పేరు మాన్ స్టర్. ఇందులో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు యాంగ్రీ మేన్.

కొత్త సినిమా మొదలుపెట్టిన రాజశేఖర్
X

యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా, పవన్ సాదినేని దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మాతగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు 'మాన్‌స్టర్‌' అనే టైటిల్ పెట్టారు.

పవన్ సాదినేని ఈ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్‌స్టర్‌ కథ ఇది. నిన్న ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌లతో కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దామోధర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు క్లాప్‌బోర్డ్‌ను కొట్టారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రం కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. విప్లవ్ నైషధం ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి రాకేందు మౌళి డైలాగ్స్ అందిస్తున్నాడు. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే నిర్ణయిస్తారు.

First Published:  24 Aug 2022 3:19 AM GMT
Next Story