Telugu Global
Cinema & Entertainment

Jailer 2 | రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్

Rajinikanth's Jailer Sequel - సూపర్ హిట్ అయిన జైలర్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. మరో వారం రోజుల్లో దీనిపై ప్రకటన రానుంది.

Jailer 2 | రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్
X

గతేడాది బ్లాక్ బస్టర్ హిట్స్ లో జైలర్ కూడా ఒకటి. రజనీకాంత్ ను మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

జైలర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు నెల్సన్. ఇప్పుడీ దర్శకుడు సీక్వెల్ పై పని మొదలుపెట్టాడు. త్వరలోనే సన్ పిక్చర్స్, ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనుంది.

సినిమాలో రిటైర్డ్ జైలర్ గా నటించారు రజనీకాంత్. అవినీతి, అక్రమాల్ని అస్సలు సహించని ఈ వ్యక్తి, ఏకంగా తన కన్నకొడుకునే చంపుతారు. అక్కడితో ఫస్ట్ పార్ట్ కు శుభం కార్డ్ పడుతుంది. సెకెండ్ పార్ట్ ఎలా మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

జైలర్ లో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించింది. తమన్న స్పెషల్ సాంగ్, ఈ సినిమాకు అదనపు మైలేజీ తీసుకొచ్చింది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  21 Jan 2024 5:37 PM GMT
Next Story