Telugu Global
Cinema & Entertainment

Ramcharan | గేమ్ ఛేంజర్ డేట్ చెప్పిన చరణ్

Ramcharan - శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ మూవీ విడుదల తేదీని స్వయంగా ప్రకటించాడు.

Ramcharan | గేమ్ ఛేంజర్ డేట్ చెప్పిన చరణ్
X

దాదాపు ఏడాదిన్నరగా గేమ్ ఛేంజర్ సినిమాపైనే ఉన్నాడు చరణ్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ ఎవ్వరికీ లేదు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీపై స్పందించాడు రామ్ చరణ్.

"ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారితో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్నాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. శంక‌ర్‌గారు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. డిఫ‌రెంట్ స్టోరీతో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల‌ల్లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం’’

ఇలా గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై స్పందించాడు రామ్ చరణ్. చెన్నైలో డాక్టరేట్ అందుకున్న ఈ నటుడు, స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా చెన్నైతో తనుకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు.

"చెన్నై నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్న‌గారు త‌న ప్ర‌యాణాన్ని ఇక్క‌డ నుంచే ప్రారంభించారు. నా సతీమ‌ణి ఉపాస‌న వాళ్లు అపోలో హాస్పిట‌ల్స్‌ను కూడా ఇక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో 80 శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాల‌ని క‌ల‌లు క‌ని చెన్నైకి వ‌స్తే అది నేర‌వేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్ప‌త‌నం. అన్ని రంగాల వారికి ఈ భూమి క‌ల‌ల‌ను నేరవేర్చేదిగా ఉంటూ వ‌స్తుంది. నేను ఇక్క‌డ విజ‌య హాస్పిట‌ల్‌లోనే పుట్టి పెరిగాను."

గేమ్ చేంజర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి, బుచ్చిబాబు దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాలని ఎదురుచూస్తున్నాడు రామ్ చరణ్. జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్.

First Published:  14 April 2024 3:44 PM GMT
Next Story