Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | మరో షెడ్యూల్ పూర్తిచేసిన మిస్టర్ బచ్చన్

Mr Bachchan - రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Mr Bachchan | మరో షెడ్యూల్ పూర్తిచేసిన మిస్టర్ బచ్చన్
X

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్ కాంబోలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను పూర్తిచేశారు. కీలక షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర బృందం అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు.

హరీష్ శంకర్ ఎప్పటిలాగే శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రవితేజను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తయిన తర్వాత, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  18 April 2024 5:14 PM GMT
Next Story