Telugu Global
Cinema & Entertainment

Renu Desai | రీఎంట్రీ మూవీలో రేణుదేశాయ్ లుక్ ఇదే

Renu Desai - రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Renu Desai | రీఎంట్రీ మూవీలో రేణుదేశాయ్ లుక్ ఇదే
X

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈనెల 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో హేమలత లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించబోతున్నారు రేణు దేశాయ్. ఓ పసిబిడ్డని పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇలాంటి ఓ సంఘసంస్కర్త పాత్రను పోషించడం రేణుదేశాయ్ కు ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ సినిమాతో ఆమె కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పవన్ తో విడిపోయిన తర్వాత పూర్తిగా పిల్లల బాధ్యతలతో మునిగిపోయిన రేణు, ఇన్నేళ్లకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ సినిమాల్లోకి వచ్చారు.

రేపు ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మధి, సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. శ్రీకాంత్ విస్సా కథ-డైలాగ్స్ అందిస్తున్నాడు. అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

First Published:  2 Oct 2023 8:10 AM GMT
Next Story