Telugu Global
Cinema & Entertainment

Salaar | గ్లోబల్ స్థాయికి ఎదిగిన సలార్

Salaar - ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల్ని సైతం ఎట్రాక్ట్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా దుమ్ముదులుపుతోంది.

‘సాలార్’ బాక్సాఫీసు రన్ ఓవర్!
X

ఓటీటీ స్ట్రీమింగ్ తో మరోసారి సూపర్ సెన్సేషనల్ గా మారింది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని అనేక పాత్రల వల్ల, కథలో గందరగోళం వల్ల మిక్స్ డ్ టాక్ వచ్చింది.

అయితే, డిజిటల్‌ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు మరింత ఆదరణ పెరిగింది. ఓటీటీ ప్రేక్షకులు సలార్ కథను పూర్తిగా అర్థం చేసుకోవడంతో పాటు.. ప్రభాస్ మొదటి ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా రిపీట్ మోడ్‌లో చూస్తున్నారు.

ఈ చిత్రం త్వరలోనే ఇంగ్లిష్ లో స్ట్రీమింగ్ కు వస్తుందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. అయితే ఇప్పటికే దీనికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి కూడా భారీ ప్రశంసలు లభిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో RRR కూడా అదే విధంగా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు సలార్‌కు కూడా అలాంటి స్పందన వస్తోంది, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌లో సూపర్ రెస్పాన్స్ రావడంతో, సలార్ గ్లోబల్‌గా మారింది.

ఇంగ్లీష్ వెర్షన్ వచ్చిన తర్వాత, ఈ సినిమా మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెస్పాన్స్ తో సలార్-2 ను మరింత భారీగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

First Published:  28 Jan 2024 2:41 AM GMT
Next Story