Telugu Global
Cinema & Entertainment

Salaar | సలార్ హిందీ స్ట్రీమింగ్ రెడీ

Salaar | ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.

‘సాలార్’ బాక్సాఫీసు రన్ ఓవర్!
X

సలార్ హిందీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎట్టకేలకు బయటకు వచ్చాయి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీ స్ట్రీమింగ్ రైట్స్‌ని విడివిడిగా విక్రయించడం వల్ల ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. సౌత్ భాషల వెర్షన్లు అన్నీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసినా, హిందీ వెర్షన్ ఎక్కడా కనిపించకపోవడంతో చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది

సలార్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. నార్త్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్టవ్వడంతో, చాలామంది ఉత్తరాది ప్రేక్షకులు హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరి 16 నుండి సలార్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. భారతదేశంలో 486 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఈ వసూళ్లు, రూ. 612 కోట్లు. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత చిత్రంగా నిలిచింది సలార్. జైలర్ సెట్ చేసిన 605 కోట్ల మార్కును అధిగమించింది.

First Published:  9 Feb 2024 4:52 PM GMT
Next Story