Telugu Global
Cinema & Entertainment

Sharwanand: శర్వానంద్ నిశ్చితార్థం పూర్తి

Sharwanand Engagement: హీరో శర్వానంద్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈరోజు అతడి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sharwanand: శర్వానంద్ నిశ్చితార్థం పూర్తి
X

టాలీవుడ్ లో మరో హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడే శర్వానంద్. ఈ రోజు శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది.

పొలిటీషియన్ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాల్ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె పేరు రక్షితా రెడ్డి. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లో హైదరాబాద్ నుంచే పని చేస్తోంది.

ఆమెను శర్వానంద్ కు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈరోజు జరిగిన నిశ్చితార్థానికి శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్, తన భార్యతో కలిసి హాజరయ్యాడు. శర్వాకు శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ వేసవిలో శర్వానంద్ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. త్వరలోనే పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. మొత్తమ్మీద కొత్త ఏడాదిలో మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నిఖిల్, నితిన్, నాగశౌర్య, రానా సరసన శర్వా కూడా చేరబోతున్నాడు.








First Published:  26 Jan 2023 10:42 AM GMT
Next Story