Telugu Global
Cinema & Entertainment

Sharwanand - పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన శర్వానంద్

Sharwanand Marriage - శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. రక్షిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

Sharwanand - పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన శర్వానంద్
X

హీరో శర్వానంద్, రక్షిత వివాహం చేసుకున్నారు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకలు రెండు రోజుల ముందు అంటే, జూన్ 2 నుంచి మొదలయ్యాయి. మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్‌తో ప్రారంభమయ్యాయి. నిన్న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లోని విక్రమ్ ఆదిత్య బాల్‌రూమ్‌లో ‘పెళ్లికొడుకు’ వేడుక వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు రామ్ చరణ్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, యువి క్రియేషన్స్ వంశీ - విక్రమ్, దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్, హర్షిత్, హన్షిత తదితరులు హాజరయ్యారు.

శర్వానంద్, రక్షిత పెళ్లి దుస్తుల్లో మెరిశారు. శర్వానంద్ క్రీమ్ పింక్ షేర్వానీ, రక్షిత సిల్వర్ క్రీమ్ కలర్ చీర ధరించారు. వీళ్లిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ఇక సంగీత్ లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లోని డోంట్ స్టాప్ డాన్సింగ్ పాటకు ఇద్దరూ స్టెప్పులేశారు.

జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. పెళ్లికి మిస్సయిన ప్రముఖులంతా రిసెప్షన్ కు హాజరుకానున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కొనసాగిస్తాడు శర్వా.

First Published:  4 Jun 2023 2:47 PM GMT
Next Story