Telugu Global
Cinema & Entertainment

OG Movie | అన్నీ పేలతాయంటున్న యూనిట్

OG Movie - పవన్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా నుంచి సెప్టెంబర్ 2న ఓ స్పెషల్ రాబోతోంది.

OG Movie | అన్నీ పేలతాయంటున్న యూనిట్
X

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఓజీ యూనిట్ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ఓజీ అప్ డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. ఇప్పుడు క్రేజీ అప్ డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2న క్రేజీ అప్ డేట్ ఉంటుందని ప్రకటించింది.

ఓజీ ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటెర్టైమెంట్స్ సంస్థ.. "రేయ్.. ఆగండి.. అన్ని పేల్తాయి.." అంటూ స్పందించింది.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. కాబట్టి ఆరోజు ఓజీ నుంచి కచ్చితంగా అప్ డేట్ ఉంటుందనే విషయం కన్ ఫర్మ్ అయింది. అయితే ఇక్కడే మరో క్రేజీ అప్ డేట్ ఉంది.

కొద్దిసేపటి కిందట నో ఫస్ట్ లుక్ అంటూ దర్శకుడు సుజీత్ స్పందించాడు. అంటే దీనర్థం, ఏకంగా గ్లింప్స్ వస్తుందని చెప్పకనే చెప్పాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అయింది.

ఈ అప్ డేట్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆరోజు టీజర్ రిలీజ్ కానుందని, ఆ టీజర్ 72 సెకండ్స్ ఉంటుందనే టాక్ ఆల్రెడీ మొదలైంది. అంతేకాదు, ఆ గ్లింప్స్ కు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడనే టాక్ కూడా నడుస్తోంది. అర్జున్ దాస్ వాయిస్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. పైగా ఓజీలో అర్జున్ దాస్ కూడా ఓ రోల్ పోషిస్తున్నాడు.

లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న స్ట్రయిట్ మూవీ ఓజీ. ఈమధ్య కాలంలో పవన్ అన్నీ రీమేక్స్ చేశాడు. బ్రో, వకీల్ సాబ్, భీమ్లానాయక్.. ఇలా అన్నీ రీమేకులే. అందుకే కొత్త కథతో, స్ట్రయిట్ మూవీగా వస్తున్న ఓజీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

First Published:  28 Aug 2023 5:34 PM GMT
Next Story