Telugu Global
Cinema & Entertainment

SriRangaNeethulu - మరో మూవీ రెడీ చేసిన సుహాస్

SriRangaNeethulu - సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా శ్రీరంగ నీతులు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజైంది.

SriRangaNeethulu - మరో మూవీ రెడీ చేసిన సుహాస్
X

సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం `శ్రీ‌రంగ‌నీతులు`. రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై వస్తున్న తొలి సినిమా ఇదే. వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మాత. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నాడు.

ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటరైంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఈ రోజు టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ టైటిల్ పోస్ట‌ర్‌ని ప‌రిశీలిస్తే...మైధానంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ముందు ముగ్గురు యువ‌కులు కూర్చుని ఉండ‌డం గ‌మ‌నించ‌వచ్చు. టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు టైటిల్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటోంది. అతి త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

`అర్జున్ రెడ్డి` ఫేమ్ హ‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, `సేవ్ ది టైగ‌ర్స్` ఫేమ్ అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నునున్నారు.




First Published:  16 May 2023 11:34 AM GMT
Next Story