Telugu Global
Cinema & Entertainment

Tamanna | కల నెరవేరిందంటున్న తమన్న

Tamanna - ఇటు చిరంజీవితో, అటు రజనీకాంత్ తో ఏకకాలంలో నటించింది తమన్న. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి.

Tamanna | కల నెరవేరిందంటున్న తమన్న
X

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో తమన్నా హీరోయిన్. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజీ ప్రాజెక్ట్ 'జైలర్‌' లో కూడా కీలక పాత్రలో కనిపించనుంది తమన్నా.

ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న భోళా శంకర్ ఆగస్ట్ 11న, జైలర్ ఆగస్ట్10న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ రెండు చిత్రాల్లో నటించిన హీరోయిన్ తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తన కల నెరవేరిందంటోంది.

"ఒక రోజు గ్యాప్ లో నేను నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలౌతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలసి నటించడం, ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడంతో నా కల నెరవేరినట్లయింది."

భోళాశంకర్ సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ పోషించింది తమన్న. ఇక జైలర్ సినిమాలో ఆమెది చిన్న పాత్ర. అయినప్పటికీ జైలర్ సినిమాలోని 'కావాలయ్యా' సాంగ్ సూపర్ హిట్ తో తమన్నా పేరు మారుమోగిపోతోంది.

First Published:  4 Aug 2023 4:15 PM GMT
Next Story