Telugu Global
Cinema & Entertainment

Odela 2 | నాగ సాధువుగా తమన్నా

Odela 2 - తమన్న లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా ఓదెల-2. ఈ సినిమా నుంచి మిల్కీ బ్యూటీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Odela 2 | నాగ సాధువుగా తమన్నా
X

ఓటీటీలో విజయం సాధించిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ గా వస్తోంది ఓదెల 2. ఈ సినిమా రీసెంట్ గా కాశీలో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అక్కడే మొదలైంది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది క్రియేటర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి.మధు నిర్మిస్తున్నారు.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం తమన్నా కంప్లీట్ గా మేకోవర్ అయినట్టు కనిపిస్తోంది. నాగ సాధువులా వేషం ధరించి, ఒక దండెము, మరో చేతిలో ఢమరుకం పట్టుకొని, నుదుటిపై పసుపు బొట్టు పెట్టుకొని కనిపించింది.

కాశీ ఘాట్‌లపై నడుస్తూ, ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తోంది. ఈ ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. నిజంగా శివరాత్రికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్.

ఓదెల 2 గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. కాశీలో ఉన్న తమన్నాకు, ఓదెల గ్రామానికి లింక్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.




First Published:  8 March 2024 5:24 PM GMT
Next Story