Telugu Global
Cinema & Entertainment

Tamanna | సూపర్ హిట్ సీక్వెల్ లో మిల్కీ బ్యూటీ

Tamanna - ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఇందులో తమన్నా లీడ్ రోల్ పోషిస్తోంది.

Tamanna | సూపర్ హిట్ సీక్వెల్ లో మిల్కీ బ్యూటీ
X

2022లో ఓటీటీలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సంచలన విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. పేరు ‘ఓదెల-2’. కథ, కాస్టింగ్, ప్రొడక్షన్, టెక్నికల్ అంశాల పరంగా సాంకేతిక ప్రమాణాల పరంగా ఈ సినిమా మరింత ఉన్నతంగా ఉండబోతోంది.

ఓదెల-2లో తమన్నా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది క్రియేటర్ గా ఉన్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఓదెల 2 కూడా అదే గ్రామం చుట్టూ తిరుగుతూ, ఆ ఊరిలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో రాబోతోంది. టైటిల్ పోస్టర్ ను ఆధ్యాత్మికంగా డిజైన్ చేశారు.

ఓదెల రైల్వేస్టేషన్ లో లీడ్ రోల్ పోషించిన హెబ్బా పటేల్, సీక్వెల్ కు వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈమెతో పాటు, వశిష్ట సింహా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  2 March 2024 8:05 AM GMT
Next Story