Telugu Global
Cinema & Entertainment

Tamanna | ఓదెల రైల్వే స్టేషన్ లో తమన్నా?

Tamanna - సంపత్ నందితో వర్క్ చేయడం తమన్నకు కొత్త కాదు. ఇప్పుడీ బ్యూటీ అతడితో మరోసారి సినిమా చేయబోతోందని టాక్.

Tamanna | ఓదెల రైల్వే స్టేషన్ లో తమన్నా?
X

అందాలు ఆరబోస్తూ కొత్తగా కనిపించడమే కాదు, కొత్త క్యారెక్టర్లు కూడా ఎంచుకుంటోంది తమన్న. ఇప్పటికే వెబ్ సిరీసుల్లో తన ప్రతాపం చూపించిన మిల్కీ బ్యూటీ, ఇప్పుడు ఓ డిఫరెంట్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అదే ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్.

అన్నీ తానై సంపత్ నంది తెరకెక్కించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. హెబ్బా పటేల్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను అశోక్ తేజ డైరక్ట్ చేసినప్పటికీ, సంపత్ నంది అన్నీ చూసుకున్నాడు. కరోనా పరిస్థితుల వల్ల అప్పట్లో ఈ సినిమా థియేటర్లలోకి రాకుండా, నేరుగా ఓటీటీలో రిలీజైంది. అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు సంపత్ నంది. ఈసారి హెబ్బా పటేల్ స్థానంలో తమన్నాను తీసుకుంటున్నాడు. అంతేకాదు, స్వయంగా తనే డైరక్ట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు.

ఇంతకుముందు సంపత్ నంది, తమన్న కలిసి సీటీమార్, బెంగాల్ టైగర్, రచ్చ లాంటి సినిమాలు చేశారు. సంపత్ నందిపై నమ్మకంతో ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ లో నటించేందుకు తమన్న అంగీకరించింది. ఈ సినిమాలో ఆమె ఇంకాస్త బోల్డ్ గా కనిపిస్తుందట. అంతేకాదు, మేకప్ లేకుండా నటిస్తుందంట.

First Published:  22 Jan 2024 5:09 PM GMT
Next Story