Telugu Global
Cinema & Entertainment

Tamanna | తమన్నా అస్సలు తగ్గట్లేదుగా..!

Tamanna - మిల్కీ బ్యూటీ అస్సలు తగ్గట్లేదు. కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న బోల్డ్ ఫొటోషూట్స్ వైరల్ అవుతున్నాయి.

Tamanna | తమన్నా అస్సలు తగ్గట్లేదుగా..!
X

ఒకప్పట్లా మడికట్టుకొని కూర్చుంటే ఎవరు చూస్తారు, కాలానికి తగ్గట్టు మారాల్సిందే. లేదంటే హీరోయిన్ పాత్రలు ఇవ్వరు, ఆంటీ పాత్రలు మాత్రమే ఇస్తారంటూ గతంలో తమన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఓ వెబ్ సిరీస్ లో ఆమె బోల్డ్ గా నటించింది. దాన్ని సమర్థించుకోవడం కోసం తమన్న అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిందని చాలామంది భావించారు. కానీ అది తప్పు.

తమన్న నిజంగానే మారింది. ఆమె తమ మైండ్ సెట్ ను పూర్తిగా మార్చుకుంది. గ్లామర్ కు సరికొత్త అర్థాన్నిస్తూ, అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఆమె నుంచి వస్తున్న ఫొటోషూట్స్ చూస్తుంటే, తమన్నాలో ఈ యాంగిల్ కూడా ఉందా అనే ఆశ్చర్యం కలుగుతుంది.

మినిమం వారానికో ఫొటోషూట్ రిలీజ్ చేస్తోంది తమన్న. వీటిలో ఎక్కడా సంప్రదాయబద్ధంగా కనిపించడానికి ఆమె ఇష్టపడడం లేదు. ప్రతి ఫొటోలో హాట్ నెస్ చూపిస్తోంది, అందాలు ఆరబోస్తోంది. తనలో ఇంకా అందం, కొత్త కొత్త కోణాలు దాగున్నాయని నిరూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆమె ఇప్పటివరకు బికినీలో మాత్రమే కనిపించలేదు. అది తప్ప మిగతా కోణాలన్నింటినీ ఆవిష్కరించింది. త్వరలోనే ఆమె బికినీలో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు జనం.

దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న తమన్న, ఇప్పుడు రూటు మార్చడంతో ఆమెకు మరోసారి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటు సినిమాలతో పాటు, అటు ఓటీటీ నుంచి ఆమెకు ఛాన్సులొస్తున్నాయి. వీటికి తోడు యాడ్స్, ఫొటోషూట్స్ సరేసరి. మొత్తానికి తమన్న తీసుకున్న బోల్డ్ డెసిషన్, ఆమె కెరీర్ ను పరుగులుపెట్టిస్తోంది.

First Published:  27 Oct 2023 5:32 PM GMT
Next Story