Telugu Global
Cinema & Entertainment

Keedaa Cola - నాయుడిగా మారిన తరుణ్ భాస్కర్

Tarun Bhaksar Keedaa Cola - కీడాకోలా అనే క్రైమ్ కామెడీ సినిమా తీస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాను డైరక్ట్ చేయడంతో పాటు, ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు.

Keedaa Cola - నాయుడిగా మారిన తరుణ్ భాస్కర్
X

తన తొలి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' రెడీ చేస్తున్నాడు. విజి సైన్మా బ్యానర్ పై భరత్ కుమార్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్ ని రివీల్ చేశారు. చేతిలో గన్, నోట్లో సిగరెట్ తో వైయొలెంట్ గా కనిపించిన తరుణ్ భాస్కర్ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో 'శ్వాస మీద ధ్యాస' అనే క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. ఈ లుక్ కు, ఆ క్యాప్షన్ కు బొత్తిగా లింక్ లేకుండా ఉంది.

దీంతోపాటు ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 28 'కీడా కోలా' టీజర్ విడుదల చేస్తున్నారు. అలాగే తరుణ్ భాస్కర్ గతంలో తీసిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకంది. ఈ సందర్భంగా జూన్ 29న ఎంపిక చేసిన థియేటర్లు & క్లబ్‌లలో ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు.

సో.. తరుణ్ భాస్కర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 అప్ డేట్స్ అన్నమాట. 28న కీడా కోలా టీజర్ రిలీజ్, 29న ఈ నగరానికి ఏమైంది రీ-రిలీజ్.. ఈ రెండు సినిమాలతో అతడు ఫుల్ జోష్ లోకి రాబోతున్నాడు.

First Published:  24 Jun 2023 8:08 AM GMT
Next Story