Telugu Global
Cinema & Entertainment

Tillu Square | టిల్లూ స్క్వేర్ ఓటీటీ రిలీజ్

Tillu Square - సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లూ స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Tillu Square Review: టిల్లు స్క్వేర్ రివ్యూ! {2.75/5}
X

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, ఈ వారాంతం కూడా భారీగా వసూళ్లు సాధించబోతోంది. ఎందుకంటే, థియేటర్లలో మరో సినిమా లేదు కాబట్టి.

ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. 4 వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో పెట్టుకునేంలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కింద నెట్ ఫ్లిక్స్ 35 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం.

సో.. తాజా సమాచారం ప్రకారం టిల్లు స్క్వేర్ సినిమా ఈ నెలాఖరకు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే అవకాశం ఉంది. జీఎస్టీ మినహాయిస్తే నైజాంలో ఈ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ 28 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ వారాంతంలో బుకింగ్స్ చాలా బాగున్నాయి. శ్రీరామ నవమి సెలవులు కూడా ఈ సినిమాకు కలిసొస్తాయి. సో.. 150 కోట్ల గ్రాస్ కు చేరుకోవడం పెద్ద సమస్య కాదంటోంది ట్రేడ్. మల్లిక్ రామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ గా కనిపించి మెప్పించింది. నాగవంశీ నిర్మాత.

First Published:  14 April 2024 3:32 PM GMT
Next Story