Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: ప్రోమో సాంగ్ పై ట్రోలింగ్

Waltair Veerayya promo song: చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ప్రోమో సాంగ్ పై విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి

Waltair Veerayya: ప్రోమో సాంగ్ పై ట్రోలింగ్
X

ఈరోజు వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ మాస్ నంబర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ కోసం దాదాపు వారం రోజులుగా మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. సాంగ్ పై అంచనాల్ని మరింత పెంచేందుకు నిన్న చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. అంతే.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది.

బాస్ పార్టీ అనే పాటను విడుదల చేయడం కోసం నిన్న ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఆ చిన్న బిట్ సాంగ్ చూసి అభిమానులు నీరుగారిపోయారు. ప్రోమో చాలా చెత్తగా ఉందంటూ దేవిశ్రీపై విరుచుకుపడుతున్నారు. ప్రోమోనే ఇలా ఉందంటే, సాంగ్ ఎలా ఉంటుందో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు మీమర్స్ కూడా రెచ్చిపోయారు. నువ్వు లుంగీ ఎత్తు, కర్చీఫ్ కట్టు లాంటి సాహిత్యంతో దేవిశ్రీ పాడిన పాటకు క్షణాల్లో పేరడీలు తయారుచేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో పాటపై అంచనాలు పెరగాల్సింది పోయి, మొత్తం వ్యవహారం కామెడీగా మారిపోయింది.

చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. మొదటి సాంగ్ విడుదలతో ప్రచారాన్ని ఆర్భాటంగా ప్రారంభించాలనుకున్నారు. అంతలోనే ఈ ప్రోమో వచ్చి కొంపముంచింది. రాబోయే రోజుల్లో వాల్తేరు వీరయ్య ప్రచారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.



First Published:  23 Nov 2022 4:03 AM GMT
Next Story