Telugu Global
Cinema & Entertainment

Capture | ఉపేంద్ర భార్య సరికొత్త ప్రయోగం

Capture Movie - ఉపేంద్ర భార్య ప్రియాంక మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. ఆ సినిమా పేరు క్యాప్చర్

Capture | ఉపేంద్ర భార్య సరికొత్త ప్రయోగం
X

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతవరకు సినీ ప్రపంచంలో రానటువంటి ఈ ప్రయోగాత్మక చిత్రమిది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే.

దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని రాధికా కుమారస్వామి సమర్పిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ అంతా గోవాలో జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి.

ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా అనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తారు. కన్నడ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది క్యాప్చర్ మూవీ.




First Published:  12 Nov 2023 5:11 PM GMT
Next Story